- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather Update : రేపు..ఎల్లుండి దంచికొట్టనున్న ఎండలు!
వేసవి కాలం ఆరంభం నుంచే తెలంగాణ(Telangana)లో ఎండలు(Sun Fire) దంచికొడుతున్నాయి. అప్పుడే సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా నమోదు(High temperatures) అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలం ఆరంభం నుంచే తెలంగాణ(Telangana)లో ఎండలు(Sun Fire) దంచికొడుతున్నాయి. అప్పుడే సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా నమోదు(High temperatures) అవుతున్నాయి. పది దాటిందంటే చాలా హీట్ పెరిగిపోతుంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఎండలు.. రాబోయే మూడు రోజులు మరింత పెరగనున్నట్లు వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. మార్చి నుంచి మే నెల వరకు వేసవి సీజన్ కు సంబంధించిన అంచనాల(Weather Update)ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దానితోడు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వేడిగాలులు ముప్పు అధికంగా ఉందని, దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణం కంటే పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉండే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో మార్చి నెలలోనే వడగాల్పులు వీయవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటవచ్చునని, కర్ణాటక, మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక మార్చి3 , 4 తేదీల్లో ఎండలు దంచికొడతాయని చెబుతోంది. ఉష్ణోగ్రతలు 2నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్నాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎండా కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది.
ఉదయం 11 గంటల తర్వాత చిన్న పిల్లలు, వృద్ధులు, గుండెజబ్బులు, ఆస్తమా, మానసిక సమస్యలు ఉన్న వారు బయటికి వెళ్లొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఎవైనా పనులుంటే ఉదయం 11గంటలలోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలంటున్నారు. హై టెంపరేచర్, వీక్నెస్, హెడెక్, తీవ్రమైన దాహం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలుంటే వడ దెబ్బ అని గ్రహించి ఆస్పత్రికి వెళ్లాలని కోరుతున్నారు.






