- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..!
ఎట్టకేలకు ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెన్యార్ తుఫాను తన మార్గం మార్చుకొని ఇండోనేషియా వైపు పయనిస్తుండటంతో ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. కానీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం నవంబర్ 29 నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు అటు తమిళనాడులో ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక అక్టోబర్ 30వ తేదీన ఏపీలోని కోనసీమ జిల్లాలో తీరం దాటిన మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తుఫాను తీరం దాటిన తర్వాత ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో రైతులు భారీగా నష్టపోయారు. వర్షాలపై అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసారు.






