- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలి గజగజ... ఏకంగా 3.8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏపీని చలి వణికిస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాలో నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న 3.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఏపీ వాతావరణశాఖ పేర్కొంది. ఇక తెలంగాణలోనూ చలి అసాధారణంగా పెరిగింది. ఏకంగా 13 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో నిన్న 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికి తోడు విపరీతమైన పొగమంచు కూడా కురుస్తుండటంతో ఉదయం 9 దాటుతున్నావాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తీవ్రమైన చలి, పొగమంచు వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.






