నిప్పుల కొలిమిలా తెలంగాణ.. కొరుట్లలో 45.9 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు

by Kema Shiva Kumar |

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎండలు జానాలను ఠారెత్తిస్తున్నాయి.

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. కొరుట్లలో 45.9 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించేలా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కొరుట్లలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. అదేవిధంగా నల్గొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా కోహెడలలో 45.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా దండేపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులలో 45.7 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లోని మావల, కరీంనగర్‌లోని గంగాధర, నిజామాబాద్‌లోని భీమ్‌గల్, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్‌లోని సిర్పూర్ ప్రాంతాల్లో భానుడి వేడి 45.6 డిగ్రీలుగా రికార్డైంది. హన్మకొండ ధర్మసాగర్, ఖమ్మం ఏనకూరు, సూర్యాపేట మట్టంపల్లి ప్రాంతాల్లో 44.8 డిగ్రీలు, మెదక్ నర్సాపూర్, మహబూబాబాద్ తొర్రూర్, యాదాద్రి అడ్డగూడూరులలో 44.5 డిగ్రీలు, వరంగల్‌లో 44.4, జనగామలో 44.3 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ఈ తీవ్రమైన వడగాల్పులు (Heatwave) మరింత ముదిరే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story