Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఎన్ని రోజులు పడనుందంటే?!

by Kodari Anjali |

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టగా.. మరికొన్ని ప్రాంతాల్లో సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఎన్ని రోజులు పడనుందంటే?!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టగా.. మరికొన్ని ప్రాంతాల్లో సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి. నేల వేడెక్కి.. రాత్రిళ్లు కూడా వేడిగానే ఉంటోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ అధికారులు రానున్న 7 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిస్తాయని వెల్లడించింది. గంటలకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల గాలి వేగంతో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని చెబుతున్నారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story