IMD : దేశంలో నేడు రికార్డు స్థాయి 49.4 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎక్కడంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-06-14 15:42:24  IST  )

దేశంలో నేడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత(Record High Temperature)నమోదైంది.

IMD : దేశంలో నేడు రికార్డు స్థాయి 49.4 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో నేడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత(Record High Temperature)నమోదైంది. రాజస్థాన్‌(Rajasthan)లోని శ్రీగంగానగర్(SriGanganagar) లో శుక్రవారం అత్యధికంగా 49.4 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయింది. ఈమేరకు భారత వాతావరణ కేంద్రం(IMD) ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం అని తెలిపింది. శ్రీగంగానగర్ మాత్రమే కాకుండా రాజస్థాన్‌లోని చూరు, జైసల్మేర్, జోధ్ పూర్, బార్మర్, ఫలోడి వంటి ప్రాంతాల్లో కూడా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని IMD పేర్కొంది.

Next Story