- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు వడగండ్ల వాన!?
తెలంగాణ(Telangana)లో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు రోజుల క్రితం మేఘాలు చల్లబడి పలు జిల్లాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే. మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ తరుణంలో ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లని కబురు తెలిపింది. రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. హైదరాబాద్(Hyderabad)తో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, బలమైన గాలులు వీచే ప్రమాదముంది.
వడగండ్ల వాన.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
అకాల వర్షాల వల్ల పంట నష్టం కలగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కోత దశలో ఉన్న పంటలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యాన్ని కూడా కవర్లతో పూర్తిగా కప్పి ఉంచాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పశువులను కూడా సురక్షితమైన షెడ్లలో ఉంచాలి. పొలాల్లోని విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్లకూడదు. వడగండ్ల వాన, పిడుగులు(thunderbolts) పడే ఛాన్స్ ఉన్నందున రైతులు వ్యవసాయ పొలాలు వద్దకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.






