- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మీదుగా ఈశాన్య రుతుపవనాల తిరోగమనం.. ఎల్లో అలర్ట్ జారీ
ఈశాన్య రుతుపవనాల తిరోగమనం అయ్యాయి. దక్షిణ-పశ్చిమ రుతుపవనాలు తిరిగి వెనక్కి వెళుతున్న సమయంలో భారతదేశంలో “ఈశాన్య రుతుపవనాలు” అని పిలుస్తారు.

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాల (northeast monsoon) తిరోగమనం అయ్యాయి. దక్షిణ-పశ్చిమ రుతుపవనాలు (Monsoons) తిరిగి వెనక్కి వెళుతున్న సమయంలో భారతదేశంలో “ఈశాన్య రుతుపవనాలు” అని పిలుస్తారు. వీటి వల్ల దేశంలో చిట్టచివరి వర్షాలు నమోదవుతాయి. సాధారణంగా అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య ఈ ధోరణి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తూర్పు తీర ప్రాంతాలు ఈ వర్షాల ద్వారా మిగిలిన సంవత్సర వర్షాల అవసరాన్ని కొంతగా తీర్చుకుంటాయి. ఈ క్రమంలోనే తెలంగాణ మీదుగా ఈశాన్య రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది.
దీంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు ఏపీలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.






