మధ్యాహ్నానికి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారడంపై ఐఎండీ క్లారిటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-10 03:20:03  IST  )

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తొలుత ఈ వాయుగుండం తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.

మధ్యాహ్నానికి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారడంపై ఐఎండీ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తొలుత ఈ వాయుగుండం తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కానీ.. ఇప్పుడు తుపానుగా మారే అవకాశాలు లేవని ఐఎండీ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే తుపానుగా మారలేదని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశగా కదులుతోందని, మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి - జాఫ్నా మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం ముందుకు కదిలినట్లు తెలిపింది. ట్రింకోమలికి తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో, పొట్టువిల్ కు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరి కరైకాల్ కు 3700 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఏపీలో వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Next Story