Today Weather Update: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

by Kodari Anjali |

ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ఈ నెల మొత్తం వానలు దంచికొట్టనున్నాయని వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు.

Today Weather Update: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ఈ నెల మొత్తం వానలు దంచికొట్టనున్నాయని వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. రోహిణి కార్తె వేళ భనుడు భగభగలాడుతాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇక వానలు ఆగేలా కనిపించడం లేదు. నైరుతి బుురు పవనాలు ముందుగానే ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాయి. కాగా జూన్ మొదటి వీక్‌లోనే బుుతుపవనాలు తెలుగు రాష్రాల్లోకి ప్రవేశించనున్నాయి.

అయితే అరేబియా సముద్రంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నేడు, రేపు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మే 31 లేదా జూన్ 2 న నైరుతి బుుతు పవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు రానున్నాయని పేర్కొంది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story