Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-18 11:09:12  IST  )

ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు(Heavy Rains) కురిసాయి.

Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు(Heavy Rains) కురిసాయి. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే మరోవైపు అకాల వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీలోని కర్నూల్ జిల్లాలోని ఆలూరు, మహానంది, నంద్యాల, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇక తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజమాబాద్, మెదక్, సిరిసిల్లా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి.

కొన్నిచోట్ల వడగళ్ళ వానలు కురిసాయి. అయితే కొన్ని జిల్లాల్లో అధిక వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతూ విచిత్రమైన పరిస్థితులు రెండు రాష్ట్రాల్లోనూ నెలకొన్నాయి. ఇక హైదరాబాద్(Hyderabad) నగరంలో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

Next Story