నగరాన్ని తాకిన మొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు

by Muthe.Rajitha |

మొంథా తుఫాను మరో గంటలో కాకినాడ తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది.

నగరాన్ని తాకిన మొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను మరో గంటలో కాకినాడ తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతోపాటు.. 100కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా మొంథా తుఫాను ఎఫెక్ట్ హైదరాబాద్ నగరాన్ని తాకింది. ఫలితంగా హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా వంటిచోట్ల ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.

మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Next Story