- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Weather: దంచికొడుతున్న వర్షం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం (Weather) మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండలు (The sun) మండుతుండగా, మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మంగళవారం వర్షం (Rains) దంచికొడుతోంది. నిన్నటి వరకు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన నగర ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. గచ్చిబౌలి, పటాన్‌చెరు, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాబోయే రెండు గంటల్లో నాగర్‌కర్నూలు, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల్లో వర్షం పడనుందని వాతావారణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలు జిల్లాలో వడగండ్ల వాన పడటంతో భారీగా పంట నష్టం సంభవిస్తోంది. మరో వైపు రానున్న మరికొన్ని రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే నెలలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.