- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం
by Muthe.Rajitha |
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలో ఉదయం నుంచే ఆకాశం మేఘాలతో కప్పి ఉండగా.., మధ్యాహ్నం తర్వాత అనేక చోట్ల భారీ వాన కురిసింది. ముఖ్యంగా ఖైరతాబాద్, మధురానగర్, యూసఫ్‌గూడ, బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి వంటి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. అల్ప పీడన ప్రభావంతో రానున్న మరో మూడురోజులు దక్షిణ తెలంగాణతోసహా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Next Story






