Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad Rains)లో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Massive Rains) కురిసింది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad Rains)లో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Massive Rains) కురిసింది. సాయంత్రం 8 గంటల సమయంలో నగరంలోని పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, నేరేడ్ మెట్, సూరారం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దాదాపు 2 గంటలపాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి, భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

RC పురంలో 50 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొన్నది. IMD సూచనల ప్రకారం.. నగరంలో సాయంత్రం నుంచి మేఘావృతమైన ఆకాశంతో వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

ఏదైనా అవసరం అయితే 040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేసి నీరు నిలవడం, చెట్లు కూలడం వంటి వాటికి సహాయం పొందవచ్చునని GHMC హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC, HYDRA బృందాలు నీటి నిల్వలను తొలగించడానికి, ఇతర సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగాయి.

Next Story