తీవ్ర వాయుగుండం.. రాయలసీమలో వర్షాలు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-08 03:01:04  IST  )

ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తీవ్ర వాయుగుండం.. రాయలసీమలో వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడి, తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలహీనపడి పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో శ్రీలంక, తమిళనాడులో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వచ్చే 2–3 రోజుల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందని IMD తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.

Next Story