మచిలీపట్నం వైపు దూసుకు వస్తున్న తుఫాన్

by Muthe.Rajitha |   (  Updated:2025-10-28 11:35:09  IST  )

మొంథా తుఫాను మరికొద్దిగంటల్లో తీరాన్ని తాకనుంది.

మచిలీపట్నం వైపు దూసుకు వస్తున్న తుఫాన్
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను మరికొద్దిగంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతోపాటు.. 100కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాను మచిలీపట్నానికి 70కిమీల దూరంలో కేంద్రీకృతం కాగా.. శరవేగంగా మచిలీపట్నం-కళింగపట్నం వైపు దూసుకు వస్తోంది. గంటకు 15కిమీల వేగంతో తీరం వైపు వస్తోందని APSDMA అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం మచిలీపట్నానికి 70కిమీల దూరంలో, కాకినాడకు 150కిమీల దూరంలో, విశాఖపట్నానికి 250కిమీల దూరంలో ఉంది. తీరాన్ని దాటే సమయంలో 110కిమీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులను రాత్రి 7 గంటల నుంచి మూసివేస్తున్నట్టు, ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో ఇళ్ళు దాటి బయటకు రావొద్దని హెచ్చరించింది.

Read More... Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్

Next Story