తెలంగాణను వణికిస్తున్న చలి.. పొగమంచుతో కనిపించని వాహనాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-23 03:05:15  IST  )

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా చలి విజృంభిస్తోంది.

తెలంగాణను వణికిస్తున్న చలి.. పొగమంచుతో కనిపించని వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా చలి విజృంభిస్తోంది. దీంతో హైదరాబాద్ (Hyderabad) సహా మొత్తం 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహిర్‌ (Kohir)లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల నమోదైన 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్‌లో అతి తక్కువగా నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక హైదరాబాద్ (Hyderabad)-ముంబై (Mumbai) జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుపోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. రోడ్లపై దట్టంగా పొగమంచు ఆవరించడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కోహిర్ ప్రాంతంలో ఉదయం 8 గంటలు దాటేవరకు బయటకు రావడమే కష్టంగా మారింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇంటి బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు వెచ్చని బట్టలు ధరించి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోహిర్, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటూ, రాబోయే రోజుల్లో కూడా చలి కొనసాగే అవకాశం ఉంది.

Next Story