తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

by Muthe.Rajitha |

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇండియన్ మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) డిసెంబర్ 24 వరకు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5°C నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 7.6°C, వికారాబాద్‌లో 7°C, ఆసిఫాబాద్‌లో 7.2°C, మెదక్, కామారెడ్డిలో 7.9°C వంటి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12°C మధ్య ఉండగా.. HCU ప్రాంతంలో 6.3°C వరకు పడిపోయింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం జిల్లాల్లో చలి మరింత తీవ్రంగా ఉండగా, అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ చలి తీవ్రత డిసెంబర్ చివరి వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది

Next Story