- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. రెండు రోజుల్లో 2 లేదా 3 డిగ్రీలకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణ రాష్ర్టంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు రెండు నుండి మూడు డిగ్రీలు తక్కవగా నమోదవుతున్నట్లు పేర్కొంది.
గురువారం రాష్ట్రంలో అత్యధికంగా కుమరం భీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెదారిలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.2, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7.5, వికారాబాద్ జిల్లా భీంపూర్‌లో 7.9, కామారెడ్డిజిల్లా జుక్కల్‌లో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.8, నిజామాబాద్ జిల్లా సలూరలో 8.8, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేట్‌లో 9.1, ములుగు జిల్లా తాడ్వాయిలో 9.2, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 9.3, సిద్దిపేట్ జిల్లా మర్కూక్‌లో 9.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్ పూర్ లో 9.4, పెద్దపల్లి జిల్లా రామగిరి లో 9.5, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్‌లో 9.5, జగిత్యాల జిల్లా భీమారంలో 9.9, మెదక్ జిల్లా యెల్దుర్తిలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






