- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌కు సునామీ ముప్పు అంటూ వార్తలు.. క్లారిటీ
by Gantepaka Srikanth |
రష్యా(Russia), జపాన్(Japan)లలో అనూహ్య వాతావరణం ఏర్పడింది. రష్యాలో భూకంపం సంభవిస్తే.. జపాన్‌కు సునామీ ప్రమాదం పొంది ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా(Russia), జపాన్(Japan)లలో అనూహ్య వాతావరణం ఏర్పడింది. రష్యాలో భూకంపం సంభవిస్తే.. జపాన్‌కు సునామీ ప్రమాదం పొంది ఉంది. ఇప్పటికే భారీ సునామీ పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు. దీంతో భారత్‌కు సైతం సునామీ ముప్పు ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ (India)కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘కామ్చాట్‌స్కీ తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే, దీని కారణంగా భారత్‌కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు’ అని రాసుకొచ్చింది.
Next Story






