తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana)కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది భారత వాతావరణ కేంద్రం.

తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది భారత వాతావరణ కేంద్రం. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Massive Rains)కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(IMD) హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డా.కె నాగరత్నం హెచ్చరికలు జారీ చేశారు. రేపు అదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

అలాగే గంటకు 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలియజేశారు. ఈనెల 24 వరకు రాష్ట్రంలో అనేక చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రాజెక్టుల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story