- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్
తెలంగాణ(Telangana)లో నైరుతి ఋతుపవనాల(Monsoon) జోరు పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో నైరుతి ఋతుపవనాల(Monsoon) జోరు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. కాగా రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) బిగ్ రెయిన్ అలర్ట్(Rain Alert) ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది.
దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా ఇతర జిల్లాల్లో కూడా మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షాలు ఉండొచ్చునని తెలిపింది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రత 30°C నుంచి 32°C, ఉండే అవకాశం ఉందని, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°C వరకు ఉండవచ్చునని తెలియజేసింది.






