- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్
తెలంగాణ(Telangana)కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD).

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD). మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట, జనగామ, అదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు(Thunders) మెరుపులు, పిడుగుల(Lightning Strikes)తో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది.
కాగా ఆయా జిల్లాల్లో గంటకు 40-60 కిమీల వేగంతో ఈదురు గాలులు(Gusty Winds) వీస్తాయని, గుడిసెలు, రేకుల షెడ్ల కింద ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే వర్షం పడుతున్న సమయంలో ఎవరూ చెట్ల కింద నిలబడరాదని తెలిపింది. కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా సాయంత్రం అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.






