మరోసారి హైదరాబాద్ కు బిగ్ రెయిన్ అలర్ట్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లో మరికాసేపట్లో భారీ వర్షం అవకాశం(Rain Alert) ఉందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) హెచ్చరికలు జారీ చేసాయి.

మరోసారి హైదరాబాద్ కు బిగ్ రెయిన్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో మరికాసేపట్లో భారీ వర్షం అవకాశం(Rain Alert) ఉందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) హెచ్చరికలు జారీ చేసాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరం అంతా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురవనుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటికి రావొద్దని సూచించింది. ప్రయాణ ఏర్పాట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని హైడ్రా(HYDRAA) ఇప్పటికే నగర పౌరులకు అలర్ట్స్ జారీ చేసింది.

మరోవైపు తెలంగాణలో రాబోయే ఐదు రోజులు (జులై 21-26) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు (జులై 21), రేపు (జులై 22) కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల వంటి పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు అధికారులు. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.

Next Story