తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం

by Malleboina Mahesh |

ఇంకా మొంథా తుఫాన్ బీభత్సం నుండి బయట పడకముందే తెలుగు రాష్ట్రాలకు మరో షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం
X

దిశ, వెబ్ డెస్క్: ఇంకా మొంథా తుఫాన్ బీభత్సం నుండి బయట పడకముందే తెలుగు రాష్ట్రాలకు మరో షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అల్పపీడన బలపడితే మరోసారి భారీ వర్షాలు, గాలివానలు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వణికించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం దూసుకొచ్చిన మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణల్లో భారీ నష్టం సృష్టించిన సంగతి తెలిసిందే.

వర్షాలు, గాలివానలతో పలు జిల్లాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు పూర్తిగా సాధారణ స్థితికి రాకముందే మరో అల్పపీడనం వస్తోందన్న వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ నిపుణుల ప్రకారం.. ఈసారి ఏర్పడే వ్యవస్థ కూడా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా తుఫాన్లు దాడి చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు ఎప్పుడైనా వర్షాలు, గాలివానలు మళ్లీ ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story