- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
by Kema Shiva Kumar |
చలి తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చలి తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైనట్లుగా ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా శ్రీలంక వైపుగా నెమ్మదిగా కదలనుంది. శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలో హంబన్‌తోట, బట్టికోల మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాబోయే రేపు, ఎల్లుండి తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు.
Next Story






