ప్రకృతి పగ పట్టిందా.. అందుకే ఇన్ని మరణాలా?

by  |
ప్రకృతి పగ పట్టిందా.. అందుకే ఇన్ని మరణాలా?
X

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల వల్ల కాలంతో సంబంధం లేకుండా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అడవుల్లో మంటలంటుకోవడం, తుఫానులు, హీట్ వేవ్స్, వరదలు, కరువు, తుఫానులు వంటి వాతావరణ సంబంధిత విపత్తులు గత 50 ఏళ్లలో ఐదు రెట్లు పెరగగా, 2 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. అంతేకాదు ఆ డిజాస్టర్స్ కారణంగా దాదాపు 3.64 ట్రిలియన్ల డాలర్ల మేర నష్టపోయినట్లు యూఎన్ ఏజెన్సీ నివేదిక తాజాగా తెలిపింది.

వాతావరణ మార్పుల వల్ల సంభవించే మరణ, ఆర్థిక నష్టాలను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) దాని ‘అట్లాస్’‌లో ఆ వివరాలు ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం 1979 – 2019 మధ్య 11వేల ప్రకృతి విపత్తులు సంభవించగా, చరిత్రలోనే ఆయా డిజార్టర్స్ వల్ల అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో 1983లో ఇథియోపియాలో సంభవించిన కరువు వల్ల దాదాపు 3లక్షల మంది మరణించగా, అదిపెద్ద విపత్తుగా ఘోర విషాదాన్ని నింపింది. ఇక 2005లో వచ్చిన కత్రినా హరికేన్ వల్ల 163.61 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది. ఇక 2010లో హార్వే, మరియా, ఇర్మా వంటి తుఫానులు యునైటెడ్ స్టేట్స్‌ను నాశనం చేయగా, $ 1.38 ట్రిలియన్ల నష్టం వాటిల్లింది. కానీ టెక్నాలజీ అభివృద్ధి వల్ల, ముందు జాగ్రత్తల చర్యల కారణంగా 70లతో పోల్చుకుంటే, ఇటీవల కాలంలో మరణశాతం తగ్గడం విశేషం. వార్షిక మరణాల సంఖ్య 1970 లో 50వేలు ఉంటే, 2010లో దాదాపు 18వేలు ఉంది. WMO‌లోని 193 మెంటర్స్ కంట్రీస్‌లో కేవలం సగం దేశాలు మాత్రమే బహుళ ప్రమాద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి.



Next Story

Most Viewed