దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

26

దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన దుబ్బాకలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. గతంలో కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను తామే మొదలు పెట్టి , పూర్తి చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. 108, ఆరోగ్య శ్రీ , ఫీజు రీ ఎంబర్స్ మెంట్ , ఇలా ఎన్నో పథకాలను కాంగ్రెస్ పార్టీ అందించదన్నారు. వైద్యం ,విద్యను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తెచ్చిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందనీ, పేద కుటుంబాలకు చాలా నష్టం కలిగిస్తోందని అన్నారు. అందుకే ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ఆయన కోరారు.