రక్తపు రంగులో అంటార్కిటికా మంచుకొండలు

by  |
రక్తపు రంగులో అంటార్కిటికా మంచుకొండలు
X

ఎరుపు రంగులో మారిన మంచుగడ్డలతో పుచ్చపండును తలపిస్తున్న అంటార్కిటికా మంచు దిబ్బల ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఖండంలోని అర్జంటీన్ ద్వీపం వద్ద గల పాత బ్రిటిష్ పరిశోధనా కేంద్రం ఫారడే వద్ద ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. దీనికి కారణం అతి చల్లని పరిస్థితుల్లో నివసించ గలిగే ఆల్గే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో జెర్మినేట్ అవగలిగే క్లామిడోమొనస్‌గా దీన్ని గుర్తించారు.

కేవలం రంగులోనే కాదు వాసనలోనూ ఈ ఎరుపు వర్ణ ఆల్గే పుచ్చపండు వాసన వస్తోందని కొందరు శాస్త్రజ్ఞులు అంటున్నారు. అయితే ఈ ఆల్గే మనుషులకు ప్రమాదకరమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్ పేరును వెర్నాడ్‌స్కీ స్టేషన్‌గా మార్చారు. రక్తం రంగులో ఉన్న ఆల్గే ఫొటోలను ఉక్రెయిన్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం విడుదల చేసింది. మంచులో బతకడానికి ఈ ఆల్గే స్పోర్లను విడుదల చేస్తుంది. ఆ స్పోర్లే చలికి ఎరుపు రంగుకి మారతాయి. దీన్ని వాటర్‌మిలన్ ఫినామెనా అంటారు.



Next Story

Most Viewed