రాష్ట్రంలో కరెంట్ సప్లైపై డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాష్ట్రంలో కరెంట్ సప్లైపై డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పవర్ సప్లైపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉష్ణోగ్రతల్లో మార్పు ఎలా ఉన్నా.. విద్యుత్ శాఖ ఉద్యోగులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం వల్ల విద్యుత్ డిమాండ్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో ఆరవ తారీఖు వరకు నమోదైన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుండి ఆరోవ తేదీ వరకు 52.9 శాతం పెరుగుదల నమోదయిందన్నారు. మే 2023లో 7062 మెగావాట్లుగా ఉన్న సరాసరి డిమాండ్ 10799 మెగావాట్లకు పెరిగింది. అలాగే సరాసరి వినియోగం సైతం 157.9 మిలియన్ యూనిట్ల నుండి 226.62 మిలియన్ యూనిట్లకు పెరిగి, 43.5 శాతం పెరుగుదల నమోదు చేసిందన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది మే నెల ఆరు వరకు నమోదయిన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుండి ఆరోవ తేదీ వరకు 47.6 % పెరుగుదల నమోదయ్యింది.

మే 2023 లో 2830 మెగావాట్లుగా నున్న సరాసరి డిమాండ్ 4177 మెగావాట్లకు పెరిగింది. అలాగే సరాసరి వినియోగం సైతం 57.5 మిలియన్ యూనిట్ల నుండి 88 మిలియన్ యూనిట్లకు పెరిగి, 53 శాతం పెరుగుదల నమోదు చేసిందన్నారు. హైదరాబాద్‌లో గత ప్రభుత్వ హయాంలో 2022-2023 మధ్య విద్యుత్ వినియోగం డిమాండ్ ఒక్క శాతానికి కూడా మించలేదు. ఈ ఏడాది గత రెండు రోజులుగా దాదాపు 4000 మెగావాట్లకు మించి డిమాండ్, 90 మిలియన్ యూనిట్లకు మించి వినియోగం నమోదవుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రి పూట సరాసరి డిమాండ్ అంచనాలకు మించి నమోదవుతుంది. నిన్న రాత్రి 12.19. గంటలకు 4059 మెగావాట్లుగా దాదాపు గతేడాది0తో పోల్చుకుంటే 300 % మించి నమోదయ్యిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ వినియోగం పెరుగుతున్నా మా సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా వుంటూ ఎక్కడ కూడా నిమిషం పాటు అంతరాయం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ విధిగా కృషి చేస్తున్న సిబ్బందిని అధికారులను అభినందించాల్సిన ప్రతిపక్షాలు లేని కరెంటు కోతలను ఉన్నట్టు ప్రచారం చేస్తూ గోబెల్స్‌కు తాతలుగా వ్యవహరిస్తున్నారని భట్టి మండిపడ్డారు.

మీ పాలనలో రైతు సోదరులు రోడ్ల మీదకెక్కి ధర్నాలు చేసిన రోజులు మర్చి పోయారా.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు విద్యుత్ శాఖ పట్ల మీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సాక్షాత్తు అప్పటి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు మీడియా ముఖంగా ఎండగట్టిన విషయం మర్చి పోయారా అని ఫైర్ అయ్యారు. సాక్షాత్తు తొమ్మిది ఏండ్లు ముఖ్యమంత్రి గా చేసిన కేసీఆర్ విద్యుత్ పట్ల చేస్తున్న దుష్ప్రచారం చాలా హేయకరమైనదన్నారు. సూర్యాపేటలో తాను ఏర్పాటు చేసుకున్న జనరేటర్ లోపం వల్ల విద్యుత్ అంతరాయమైతే ఆ నెపాన్ని విద్యుత్ శాఖ మీద వేసాడని మండిపడ్డారు.

అలాగే మహబూబ్‌నగర్ లో అసలు విద్యుత్ అంతరాయం లేకున్నా సంస్థ మీద దుష్ప్రచారం చేసారని సీరియస్ అయ్యారు. దాన్ని మేము ఆ ట్రాన్స్ ఫార్మర్ డంప్ రిపోర్ట్‌తో సాంకేతిక ఆధారాలతో తమ తప్పు లేదని నిరూపించామన్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో విద్యుత్ మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే రికార్డు స్థాయిలో వినియోగం జరుగుతుందా అనేది విజ్ఞత కలిగిన ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. మీ పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారం ప్రజలు నమ్మరు అని భట్టి అన్నారు.. ఇప్పటికైనా మీరు మీ సోషల్ మీడియా మూకలు లేని కోతలను ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తే ప్రజలు మీకు మీ పార్టీ కి తగు రీతిలో బుద్ధి చెబుతారని భట్టి అన్నారు.

Read More...

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు: భట్టి కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed