తొందరలో తల్లి కాబోతూ భర్తపై అలాంటి పోస్ట్ పెట్టిన అమలా పాల్!

by Disha Web Desk 6 |
తొందరలో తల్లి కాబోతూ భర్తపై అలాంటి పోస్ట్ పెట్టిన అమలా పాల్!
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమలా పాల్ నాయక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. గత ఏడాది అమలా పాల్ గోట్ లైఫ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి సినిమాలకు దూరం అయింది. ఇక అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల శ్రీమంతం చేసుకున్న వీడియోలను కూడా నెట్టింట పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

తొందరలో తల్లి కాబోతున్న అమలా పాల్.. తాజాగా, భర్తపై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ నాతో పాటు అర్ధరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం..మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు.

మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితం లోకి రావడం.. నిజంగా నేనే ఏదో అద్భుతమైనది చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ మరియు తిరుగులేని మద్దతు.. స్థిరమైన మూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. పదాలు చెప్పగలిగే దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా భర్తలో సరదాగా ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్‌ను పెడుతున్నారు. కాగా, అమలా పాల్ మొదటి భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన స్నేహితుడు జగత్ దేశాయ్‌‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తొందరలో వీరికి బిడ్డ జన్మించబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed