ఓటీటీలోకి రాబోతున్న పృథ్వి రాజ్ బ్లాక్ బస్టర్ ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్).. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |
ఓటీటీలోకి రాబోతున్న పృథ్వి రాజ్ బ్లాక్ బస్టర్ ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్).. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ పృథ్వి రాజ్ నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). ఒక కూలీ పడే కష్టాలను ఇందులో చూపించారు. అయితే ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 28న మలయాళం, తెలుగు భాషల్లో ‘ఆడు జీవితం’ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. అలాగే రూ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా ప్రేక్షకులను సైతం మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో సినీ ప్రియుల ఆడు జీవితం చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మే 10 ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు నిజమయ్యాయి. తాజాగా, ఆడు జీవితం ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ అయినట్లు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. దీని ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. మే 26 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story