సమంత మార్ఫింగ్ ఫోటో వైరల్.. దాని వెనుక ఉంది అతనేనా?

by Disha Web Desk 8 |
సమంత మార్ఫింగ్ ఫోటో వైరల్.. దాని వెనుక ఉంది అతనేనా?
X

దిశ, సినిమా : ఈ మధ్య సమంతకు నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోతుందనే చెప్పవచ్చు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. అంతే కాకుండా ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా సరే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ మయోసైటీస్ వ్యాధి బారిన పడి చాలా కాలం చికిత్స తీసుకుంది. ఆ తర్వాత సమంతకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. అంతే కాకుండా తను పలు ఇంటర్య్వూలలో కూడా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ బ్యూటీ తన హెల్త్ సెట్ కావాలని, ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తన హాట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంటుంది.

అయితే తాజాగా ఈ నటి మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న తనకు ఎలాంటి చికిత్స జరిగిందో ప్రజలకు తెలియజేయడానికి ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే వైద్య విధానం, అధునాత‌న‌ సాంకేతిక‌త‌తో ఆరోగ్యాన్ని తిరిగి బూస్టప్ చేయ‌డం ఎలానో తన ఇన్ స్టా వేదికగా తెలిపారు. ఆ సమయంలో సామ్ బాత్ టవల్‌తో ఉన్న ఫోటో షేర్ చేయడంతో కొందరు దానిని మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. సామ్ ఫోటోను కొందరు ఆకతాయిలు కావాలనే మార్ఫింగ్ చేసి, ఆ నగ్నఫోటోను వైరల్ చేస్తున్నారు. దీని వెనుక ఉంది వారే, అంటూ సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇంకొంత మంది సామ్‌కు కావాల్సిన ఓ వ్యక్తే ఈ పని చేయించారంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ సమంత అభిమానులు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed