వర్థన్నపేట ప్రజలకు కలగానే మిగిలిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్

by Aamani |
వర్థన్నపేట ప్రజలకు కలగానే మిగిలిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్
X

దిశ, వర్థన్నపేట: పట్టణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒక కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన తన్నీరు హరీష్ రావు మే10 ౨౦౨౨ న శంకుస్థాపన చేశారు. మొదట్లో ఆరు నెలల పాటు నత్తనడకన పనులు చేసి మధ్యలో వదిలివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టక పోవడం గమనార్హం. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమేర నిర్మాణం చేపట్టి వదిలేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రజలు మరుగు రోడ్లకు ఉపయోగిస్తున్నారు. కూరగాయలు చికెన్ మటన్ చేపలను అమ్ముకోవడానికి సరైన సౌకర్యం లేకపోవడంతో వ్యాపారస్తులు అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారికి ఇరువైపులా పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు.దీంతో ఎండాకాలం వర్షం కాలం వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోట్ల రూపాయలు నీళ్ల పాలు..

అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో కోట్ల రూపాయలు నీళ్ళ పాలు అవుతున్నాయి.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం పట్టణ కేంద్రంలోని అతిథి గృహం ను కూల్చివేశారు. ఈ స్థలంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేశారు.దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టి పిల్లర్ల దశలో పై కప్పు నిర్మించకుండా వదిలేశారు.దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.వెజ్ నాన్ వెజ్ కోసం వేర్వేరు ప్లాట్ ఫాం లను ఏర్పాటు చేశారు.వీటిపై ప్రజలు మలమూత్ర విసర్జన చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.రాత్రి వేళలో మద్యపానం సేవించడానికి మందుబాబులకు అడ్డగా మార్చుకున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారి ప్రక్కన 15 లక్షల వ్యయంతో సులబ్ కాంప్లెక్స్ తో పాటు కమర్షియల్ రూమ్ లను నిర్మించారు.కమర్షియల్ రూంలకు మున్సిపాలిటీకీ వేలం పాట నిర్వహించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.కాని మున్సిపాలిటీ అధికారులు కాలయాపన చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండీ పడేలా చేస్తున్నారు.గతంలో టెండర్ ప్రక్రియ ద్వారా వేలం వేయుట కోసం దరఖాస్తులను సైతం స్వీకరించారు.దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు రాజకీయ ఒత్తిళ్లు పేరగడంతో ఈ ప్రక్రియ మద్యలోనే నిలిచిపోయింది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.దీంతో పాటు కొన్ని లక్షల వ్యయంతో నిర్మించిన కమర్షియల్ రూమ్ లకు టెండర్ వేలం పాట నిర్వహించాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

మున్సిపల్ ఏఈ అనిల్ వివరణ..

మున్సిపల్ ఏఈ ని చరవాణిలో వివరణ కోరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు సంబంధించిన బడ్జెట్ 25 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.మిగతా డబ్బులు మంజూరు కాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు.

Next Story