6.6 శాతం వృద్ధితో పుంజుకున్న భారత ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ

by Disha Web Desk 17 |
6.6 శాతం వృద్ధితో పుంజుకున్న భారత ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) పరిశ్రమ 6.6 శాతం వృద్ధిని కనబరుస్తుందని NielsenIQ నివేదిక పేర్కొంది. 2023 మొదటి మూడు నెలల్లో నమోదైన 3.1 శాతం వృద్ధితో పోలిస్తే, ఈ త్రైమాసికంలో వాల్యూమ్ పరంగా దానిని అధిగమించిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీకి మంచి ఆదరణ ఉండగా, రాను రాను అది కాస్త క్షీణిస్తుంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి క్రమంగా పెరుగుతోంది. 2024 మొదటి త్రైమాసికంలో గ్రామీణ వృద్ధి, పట్టణ వృద్ధిని మించిపోయింది. గతంలో పోలిస్తే, ఈ త్రైమాసికంలో 5.7 శాతం పడిపోయింది.

జాతీయ స్థాయిలో, ఆహార, ఆహారేతర రంగాలు రెండూ వినియోగ వృద్ధికి దోహదపడ్డాయి. మార్చి 31, 2024 వరకు మూడు నెలల్లో, నాన్-ఫుడ్ కేటగిరీకి ఎక్కువ డిమాండ్ ఉంది. అదే ఆహార రంగంలో వాల్యూమ్ వృద్ధి Q4 2023లో 5.3 శాతం నుండి వరుసగా 4.8 శాతానికి తగ్గింది. దీనికి వ్యతిరేకంగా ఆహారేతర వర్గాలు మెరుగుపడ్డాయి, Q4 2023లో 9.6 శాతంతో పోలిస్తే సమీక్ష కాలంలో 11.1 శాతానికి చేరుకుంది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నుంచి 12.8 శాతం వృద్ధి చెందింది.

ప్రత్యేకించి వ్యక్తిగత సంరక్షణ, పర్సనల్ కేర్ & హోమ్ కేర్ విభాగాలను మంచి ఆదరణ నెలకొంది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో పెద్ద, చిన్న కంపెనీల మధ్య పోటీ నెలకొంది. పెద్ద కంపెనీలతో పోలిస్తే గత రెండు త్రైమాసికాల్లో చిన్న తయారీదారులు ఆహారేతర విభాగాలలో ఎక్కువ వాల్యూమ్ వృద్ధి రేటును చూపించారని నివేదిక పేర్కొంది.

Next Story

Most Viewed