ఇంగ్లాండ్‌ సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం..

85
washing-ton-suner

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌ రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దుర్హమ్‌లోని రివర్‌సైడ్ మైదానం వేదికగా కౌంటీ సెలెక్టర్ ఎలెవెన్‌తో ఇండియన్స్ ఎలెవెన్ వార్మప్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ తరపున బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో టెస్టు సిరీస్‌కు దూరమ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సుందర్ వేలికి గాయమైంది. అతడి బొటని వేలు బెణికినట్లు బీసీసీఐ తెలిపింది.

టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం లేకపోవడంతో త్వరలోనే వాషింగ్టన్ సుందర్ ఇండియాకు తిరిగి రానున్నాడు. అదే మ్యాచ్ తొలి రోజు భారత పేసర్ ఆవేశ్ ఖాన్ కూడా గాయపడ్డాడు. డబ్ల్యూటీసీ మ్యాచ్ సందర్భంగా శుభమన్‌గిల్ కూడా గాయపడి టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టులో ముగ్గురు క్రికెటర్లు గాయాలతో దూరమవడంతో రిప్లేస్‌మెంట్ కోసం మరోసారి బీసీసీఐని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కోరనున్నట్లు సమాచారం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..