అడవి చెట్లు ధ్వంసం చేసే వారికి హెచ్చరిక

by Sridhar Babu |

<p>దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో అడవి చెట్లు ధ్వంసం చేస్తే కేసు బుక్ చేస్తానని పినపాక మండల ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ తేజస్విని వ్యాఖ్యానించారు. మంగళవారం మండలంలోని ఇ-బయ్యారం అటవీ రేంజి పరిధిలోని మల్లారం బీట్ (ఆర్.ఎఫ్)బ్లాక్ జానంపేట అపార్ట్మెంట్ నెం.34 నందు సమాచారం నిమిత్తం వెళుుండగా అక్కడ కొందరు వ్యక్తులు అడవి చెట్లు ధ్వంసం చేస్తున్నారని ఆమె తెలిపారు. అనంతరం వారిని వెంటనే అదుపులోకి తీసుకొని [&hellip;]</p>

అడవి చెట్లు ధ్వంసం చేసే వారికి హెచ్చరిక
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో అడవి చెట్లు ధ్వంసం చేస్తే కేసు బుక్ చేస్తానని పినపాక మండల ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ తేజస్విని వ్యాఖ్యానించారు. మంగళవారం మండలంలోని ఇ-బయ్యారం అటవీ రేంజి పరిధిలోని మల్లారం బీట్ (ఆర్.ఎఫ్)బ్లాక్ జానంపేట అపార్ట్మెంట్ నెం.34 నందు సమాచారం నిమిత్తం వెళుుండగా అక్కడ కొందరు వ్యక్తులు అడవి చెట్లు ధ్వంసం చేస్తున్నారని ఆమె తెలిపారు. అనంతరం వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. జాడి రాంబాబు, కొమరం శివ ప్రసాద్,జాడి కిరణ్,షేక్ ఖాదర్ బీ, జాడి కౌసల్య అనే వ్యక్తులు అడవిని ధ్వంసం చేసినందుకు అటవీ సంరక్షణచట్టం ప్రకారం 1967,1980 సెక్షన్ కింద కేసు నమోదు చేసి మణుగూరు మండలంలోని జుడీషియల్ కోర్టుకు తరలించామన్నారు. ఎంతటివారైనా సరే అడవిని ధ్వంసం చేస్తే ఉరుకునేదిలేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story