- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి అంత్యక్రియలకు ప్రత్యేక శ్మశాన వాటికలు
<p>దిశ, వరంగల్ సిటీ: కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని సాధారణంగా వారి స్మశాన వాటికల్లో దహనం చేయడానికి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌ల కోసం వేర్వేరుగా […]</p>

దిశ, వరంగల్ సిటీ: కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని సాధారణంగా వారి స్మశాన వాటికల్లో దహనం చేయడానికి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను స్మశాన వాటికలకు తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాల దహనం సాఫీగా జరిగేందుకు వారి సంబంధీకులు సహకరించడానికి డీఎఫ్‌ఓ కిశోర్ ఆధ్వర్యంలో 12 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
బల్దియాలో కరోనాతో బాధపడుతున్న కిందిస్థాయి ఉద్యోగులకు హోమ్ క్వారెంటైన్ నిమిత్తం మున్సిపల్ అతిథి గృహాన్ని, హన్మకొండ మచిలిబజార్‌లోని కమ్యూనిటీ హాళ్లను వెంటనే సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారికి బల్దియా ఆధ్వర్యంలో భోజనం సదుపాయం కల్పించనున్నట్టు కమిషనర్ తెలిపారు.






