- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లిన వొడాఫోన్ ఐడియా!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిందనుకున్న ఏజీఆర్ బకాయిల అంశాన్ని వొడాఫోన్ ఐడియా తిరిగి కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ కోరుతూ పిటిషన్ వేసింది. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే తమ ఏజీఆర్ బకాయి రూ. 28, 308 కోట్లు మాత్రమేనని, తమ ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగినట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. దీనివల్ల తాము అదనంగా దాదాపు రూ. 24,600 కోట్ల బకాయిలు నిర్ణయించినట్టు వొడాఫోన్ ఐడియా వివరించింది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిందనుకున్న ఏజీఆర్ బకాయిల అంశాన్ని వొడాఫోన్ ఐడియా తిరిగి కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ కోరుతూ పిటిషన్ వేసింది. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే తమ ఏజీఆర్ బకాయి రూ. 28, 308 కోట్లు మాత్రమేనని, తమ ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగినట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. దీనివల్ల తాము అదనంగా దాదాపు రూ. 24,600 కోట్ల బకాయిలు నిర్ణయించినట్టు వొడాఫోన్ ఐడియా వివరించింది. ప్రస్తుతం తమ సంస్థ రూ. 58,254 కోట్లలో రూ. 7,854 కోట్ల బకాయిలను చెల్లించినట్టు స్పష్టం చేసింది.
తమ ఏజీఆర్ బకాయిలను టెలికాం శాఖ సరిగా లెక్కించలేదని, దీనిపై సంస్థ స్పష్టత కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇదివరకు మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా తమ ఏజీఆర్ బకాయిలను మళ్లీ లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఏజీఆర్ బకాయిలు రూ. 43,980 కోట్లుగా ఉండగా, ఇప్పటికే రూ. 18,000 కోట్లను చెల్లించింది. అయితే, తాము లెక్కించిన దాని ప్రకారం ఎయిర్‌టెల్ ఏజీఆర్ బకాయిలు రూ. 13,004 కోట్లేనని తెలియజేసింది.






