అరకులోయలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ పర్యటన

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్నంలో ఉన్న అందాల అరకులోయను హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ పుంచి జోయెల్‌ రీఫ్‌మెన్‌, ప్రతినిధి సియాన్‌రూత్‌ సందర్శించారు. విశాఖపట్నం నుంచి కిరండోల్‌ పాసింజరు రైలులోని అద్దాల బోగీలో వీరు అరకులోయకు వచ్చారు. వీరిని అరకు రైల్వే స్టేషన్‌లో స్థానిక సీఐ జీడీ.బాబు, ఎస్‌ఐ షేక్‌ నజీర్‌ స్వాగతం పలికి, మయూరి హిల్‌ రిసార్ట్‌కు చేర్చారు. వారు మధ్యాహ్నం గిరిజన మ్యూజియం సందర్శించారు. మ్యూజియం ప్రాధాన్యతను విదేశీ ప్రతినిధులకు మేనేజర్‌ మురళి వివరించారు. [&hellip;]</p>

US Consulate General
X

దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్నంలో ఉన్న అందాల అరకులోయను హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ పుంచి జోయెల్‌ రీఫ్‌మెన్‌, ప్రతినిధి సియాన్‌రూత్‌ సందర్శించారు. విశాఖపట్నం నుంచి కిరండోల్‌ పాసింజరు రైలులోని అద్దాల బోగీలో వీరు అరకులోయకు వచ్చారు. వీరిని అరకు రైల్వే స్టేషన్‌లో స్థానిక సీఐ జీడీ.బాబు, ఎస్‌ఐ షేక్‌ నజీర్‌ స్వాగతం పలికి, మయూరి హిల్‌ రిసార్ట్‌కు చేర్చారు. వారు మధ్యాహ్నం గిరిజన మ్యూజియం సందర్శించారు. మ్యూజియం ప్రాధాన్యతను విదేశీ ప్రతినిధులకు మేనేజర్‌ మురళి వివరించారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరివెళ్లారు.

Next Story