'పాగల్‌'గా వచ్చేస్తున్న 'ఫలక్‌నుమా దాస్'

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: &#8216;ఫలక్‌నుమా దాస్&#8217; &#8216;పాగల్‌&#8217;గా వచ్చేస్తున్నాడు. తాజాగా &#8216;హిట్&#8217; చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తన ఐదో చిత్రాన్ని ప్రారంభించారు. &#8216;పాగల్&#8217; సినిమా ద్వారా డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగగా&#8230; రానా దగ్గుబాటి, దిల్ రాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. త్రినాధరావు ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా&#8230; జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రానా విశ్వక్ [&hellip;]</p>

పాగల్‌గా వచ్చేస్తున్న ఫలక్‌నుమా దాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫలక్‌నుమా దాస్’ ‘పాగల్‌’గా వచ్చేస్తున్నాడు. తాజాగా ‘హిట్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తన ఐదో చిత్రాన్ని ప్రారంభించారు. ‘పాగల్’ సినిమా ద్వారా డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగగా… రానా దగ్గుబాటి, దిల్ రాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. త్రినాధరావు ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా… జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రానా విశ్వక్ సేన్‌పై క్లాప్ ఇచ్చి సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నరేష్ కుప్పిలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags: Paagal, Falaknuma Das, Hit, VishwakSen, Rana Daggubati, Dil Raj

Next Story