శివశంకర్‌ మాస్టర్‌‌‌కు అండగా.. ‘మా’

by  |
vishnu
X

దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రియల్ హీరో సోనూసూద్, తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఆయన చికిత్సకు సహాయం అందించేందుకు ముందుకు రాగా.. తాజాగా మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు.

శివ శంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన కోలుకునేందుకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మాస్టర్ ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు వారికి ధన్యవాదాలు. ఆయన చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాడి ధైర్యం చెప్పాను. అలాగే శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

Next Story