- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిందితుడిని అప్పగిస్తారా.. అతని ఇంట్లోనే శవాన్ని కాల్చమంటారా..?
by Batti.Sumithra |
<p>దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన దొందడి రెడ్డయ్య ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, అదే గ్రామానికి చెందిన అప్రోజ్ అనే యువకుడు రెడ్డయ్యను హత్య చేశాడనే అనుమానంతో శవాన్ని అతని ఇంటి ముందు పెట్టి బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుంపలపల్లి గ్రామంలో భారీగా మోహరించారు. హత్య చేసిన వ్యక్తిని తమకు చూపించాలని లేదంటే […]</p>

X
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన దొందడి రెడ్డయ్య ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, అదే గ్రామానికి చెందిన అప్రోజ్ అనే యువకుడు రెడ్డయ్యను హత్య చేశాడనే అనుమానంతో శవాన్ని అతని ఇంటి ముందు పెట్టి బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు దుంపలపల్లి గ్రామంలో భారీగా మోహరించారు. హత్య చేసిన వ్యక్తిని తమకు చూపించాలని లేదంటే వారి ఇంట్లోనే శవాన్ని ఉంచి నిప్పంటిస్తామని బంధువులు ఖరాఖండిగా చెబుతున్నారు. కొద్దిసేపు పోలీసులకు, బంధువులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ శవాన్ని తీసుకెళ్లేది లేదంటూ అనుమానితుడి ఇంటి ముందు ఆటోలో శవాన్ని పెట్టి బాధిత కుటుంబం, గ్రామస్తులు బైఠాయించారు.
Next Story






