యువకుడి వేధింపులు భరించలేక గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2021-08-08 03:05:11  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక గ్రామ వలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని భీమవరం మండలం ఎల్వీఎన్‌పురంలో చోటు చేసుకుంది. బాధిత యువతి ఎల్‌వీఎన్‌పురంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన గుత్తుల చిన్న అనే యువకుడు వాలంటీర్‌ను వేధిస్తున్నాడు. దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు చిన్నకు వార్నింగ్ సైతం ఇచ్చారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలోఎలాంటి మార్పు రాలేదు. వేధింపులు తీవ్రం చేయడంతో [&hellip;]</p>

dead body
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక గ్రామ వలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని భీమవరం మండలం ఎల్వీఎన్‌పురంలో చోటు చేసుకుంది. బాధిత యువతి ఎల్‌వీఎన్‌పురంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన గుత్తుల చిన్న అనే యువకుడు వాలంటీర్‌ను వేధిస్తున్నాడు.

దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు చిన్నకు వార్నింగ్ సైతం ఇచ్చారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలోఎలాంటి మార్పు రాలేదు. వేధింపులు తీవ్రం చేయడంతో వాలంటీర్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాధిత యువతి మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story