రచ్చలేపుతున్న జాక్వెలిన్ ‘రక్కమ్మ’ లుక్..

by  |
jacqueline fernandez 1
X

దిశ, వెబ్‌డెస్క్: పరిచయం అక్కర్లేని నటుడు కిచ్చా సుదీప్. తెలుగులో ఈగ సినిమాలో విలన్‌గా నటించిన సుదీప్, కన్నడంలో స్టార్ హీరో. అయితే ఆయన 25వ సినిమా ‘విక్రాంత్ రోణ’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘గడంగ్ రక్కమ్మ’ అనే పాత్రలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన దుబాయ్‌లో గల బుర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.


Next Story

Most Viewed