ఇంటర్‌పోల్‌కు చిక్కిన విక్రమ్.. ఎలా బయటపడ్డాడు?

by  |
ఇంటర్‌పోల్‌కు చిక్కిన విక్రమ్.. ఎలా బయటపడ్డాడు?
X

దిశ, వెబ్‌డెస్క్: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫస్ట్‌ లుక్‌తోనే సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ చేసిన ‘కోబ్రా’.. టీజర్‌తో అంచనాలను మరింతగా పెంచేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ మూవీస్‌తో ప్రయోగాలు చేసే విక్రమ్, ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగమే చేస్తుండగా.. ఈ చిత్రంలో 7 పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా లేటెస్ట్‌గా రిలీజైన టీజర్‌లో జీనియస్ మ్యాథమేటిషియన్‌గా కనిపించిన విక్రమ్.. ప్రతీ ప్రాబ్లమ్‌కు గణితం పరిష్కారం అందిస్తున్న డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ ఈ సినిమా ద్వారానే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా.. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్‌‌తో ఆకట్టుకున్నాడు. అయితే అసలు గణితశాస్త్రవేత్త అయిన విక్రమ్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ సమాచారాన్ని రాబట్టేందుకు అతన్ని హింసిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన సినిమాను ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు.


Next Story