30 కాదు.. 99 ఏళ్లకు విజయవాడ రైల్వేస్టేషన్ లీజు

by  |
Vijayavada Railwey Stetion
X

దిశ, వెబ్‌డెస్క్ : రైల్వేలను లాభాల బాటలో నడిపించేందుకు కేంద్ర తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ గ్రేడ్ 1 స్టేషన్లను ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ కు ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. అయితే ఈ లీజు కాలం 30 ఏళ్లుగా రైల్వేశాఖ పేర్కొనడంతో ఆ సమయం సరిపోదని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దానిని 99 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే శాఖకు మొదటి నుంచి దక్షిణ మధ్య రైల్వేస్ నుంచి అధిక లాభాలు వస్తున్నాయి. అయినా ఈ రూట్లలో నూతన రైల్వే లైన్లకు కేంద్రం విముఖత చూపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం లీజుకు ఇచ్చే వాటిల్లోనూ ఇవ్వే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషనకను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం బిడ్డర్లను ఆహ్వానించింది. దీనిపై రైల్వే ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతోంది.

1888లో ప్రారంభమైన విజయవాడ రైల్వే స్టేషన్ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. మొత్తం 10 ప్లాట్‌ఫారాలు ఉన్నా ఈ స్టేషన్ నుంచి రోజుకు 250 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అయితే విజయవాడ డివిజన్ నుంచి రైల్వేకు భారీగా ఆదాయం లభిస్తున్నా 99 ఏళ్ల పాటు రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్ ప్రైవేట్ పరం అయితే ప్రయాణికులపై ఛార్జీల భారం అధికంగా ఉంటుందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖనే కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed