టీఆర్ఎస్ ఓడితేనే బతుకమ్మకు బతుకు: మాజీ ఎంపి విజయశాంతి

29

దిశ రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బతకాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగోట్టాలని అని మాజీ ఎంపీ బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా నర్కుడలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారేలా చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందన్నారు.

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని, ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే కేవలం బీజేపీతోనే సాధ్యం అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..