అశోక్‌గజపతిరాజుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అశోక్ గజపతిరాజు హయాంలో సింహాచలం దేవస్థానంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. సింహాచలం అప్పన్నస్వామిని శుక్రవారం దర్శించుకున్న విజయసాయిరెడ్డి. అశోక్ హయాంలో భూ అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. సింహాచలం అప్పన్న స్వామి ఆస్తులు దోచుకోవడంలో అశోక్ పాత్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మకర్తగా అశోక్ [&hellip;]</p>

అశోక్‌గజపతిరాజుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అశోక్ గజపతిరాజు హయాంలో సింహాచలం దేవస్థానంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. సింహాచలం అప్పన్నస్వామిని శుక్రవారం దర్శించుకున్న విజయసాయిరెడ్డి. అశోక్ హయాంలో భూ అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. సింహాచలం అప్పన్న స్వామి ఆస్తులు దోచుకోవడంలో అశోక్ పాత్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు ఏం చేశారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడకపోతే కోర్టుకు వెళ్లి పదవి ఎందుకు తెచ్చుకున్నారని నిలదీశారు. అశోక్ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టి.. ఆలయ ఆస్తులను పరిరక్షిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Next Story